సంతలో గొర్రెలు ఎవరు? వాటిని కొన్నది ఎవరు?: జగన్ కు లోకేశ్ ప్రశ్న
- సీఎం జగన్ పై లోకేశ్ విమర్శలు
- ప్రజాప్రతినిధులను సంతలో గొర్రెల్లా కొంటున్నారని ఆరోపణ
- ఓ వీడియో పోస్ట్ చేసిన లోకేశ్
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సంతలో గొర్రెలను కొన్నట్టు ఎలా కొన్నారో చూడండంటూ ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారాలోకేశ్ విమర్శలు చేశారు. గొర్రెలతో పాటు గొర్రెల డాక్టర్ ని జగన్ కొనుగోలు చేశారని, అది ఆయన ప్రత్యేకతంటూ సెటైర్లు విసురుతూ చేసిన ట్వీట్ లో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పరోక్ష విమర్శలు గుప్పించారు. సంతలో గొర్రెలు ఎవరు? వాటిని కొన్నది ఎవరు? అంటూ లోకేశ్ పోస్ట్ చేసిన వీడియోలో జగన్, వల్లభనేని వంశీలు మాట్లాడుతుండటం కనబడుతుంది.